‘‘ పాపాల్లో ఈదుతూ విషాదంలో మునిగిన హీరో కథ ’’.. చంద్రబాబు వ్యవహారంపై విజయసాయిరెడ్డి సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు, అవినీతి ఆరోపణలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవే అయితే ఆయనకు బెయిల్ ఎందుకు రావడం లేదని టీడీపీ నేతలను ప్రశ్నించారు. 

ysrcp mp vijayasai reddy satires on tdp chief chandrababu naidu ksp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు, అవినీతి ఆరోపణలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవే అయితే ఆయనకు బెయిల్ ఎందుకు రావడం లేదని టీడీపీ నేతలను ప్రశ్నించారు. కోర్టులు ఆయన వాదనను ఎందుకు పట్టించుకోవడం లేదు అని విజయసాయిరెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని మీరు భావిస్తున్నారా అని వైసీపీ ఎంపీ ప్రశ్నించారు. ప్రస్తుత కేసు పాపాల్లో ఈదుతూ విషాదంలో మునిగిన హీరో కథ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు నాయుడు.. గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. మరోవైపు చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు, ఏపీ ఫైబర్ నెట్‌ కేసుల్లో విచారించేందుకు సీఐడీ  ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు కూడా దాఖలు చేసింది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు, ఏపీ ఫైబర్ నెట్‌, అంగళ్లు ఘర్షణ కేసుల్లో చంద్రబాబు దాఖలు  చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తిరస్కరించింది. 

Also Read: చంద్రబాబును వెంటాడుతున్న కష్టాలు.. వైసీపీ సంచలన ఆరోపణలు.. మరో కేసు తప్పదా?

అయితే గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపిస్తున్న వైసీపీ.. తాజాగా మరో సంచలన ఆరోపణ చేసింది. టీడీపీ హయంలో చేపట్టిన నీరు-చెట్టు పథకంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు వైసీపీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీరు-చెట్టు పథకం కోసం కేటాయించిన డబ్బుల్లో.. రూ. 9,649 కోట్లు జన్మభూమి కమిటీల ద్వారా దోచుకుతిన్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇసుక, మట్టి ద్వారా రాష్ట్ర ఖజానా నుంచి చంద్రబాబు రూ. 24,750 కోట్లు మింగేశారని ఆరోపణలు చేసింది. 

‘‘లాభం లేనిదే ఏ పథకం కూడా పెట్టలేదు గజదొంగ చంద్రబాబు. నీరు - చెట్టు పథకంలో భాగంగా రూ.12,866 కోట్లు ఖర్చు చేయగా.. అందులో పనుల విలువ మాత్రం రూ. 3,216 కోట్లు గా చూపించారు. మిగిలిన డబ్బులు దాదాపు రూ. 9,649 కోట్లు జన్మభూమి కమిటీల ద్వారా దోచుకుతిన్నాడు. ఇవి కాక ఇసుక, మట్టి ద్వారా రాష్ట్ర ఖజానాకు కన్నం వేసి మరో రూ.24,750 కోట్లు మింగేశాడు’’ అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

అయితే చంద్రబాబుపై ఈ కొత్త ఆరోపణల నేపథ్యంలో.. మరో  కేసు నమోదు చేస్తారా? అనే చర్చ కూడా సాగుతుంది. ఈ ఆరోపణలతో చంద్రబాబును, నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాను తప్పుడు కేసులతో జైలుకు పంపేందుకే వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబుపై ఏదో ఒక కేసు నమోదు చేయాలని.. అందుకే జగన్ తప్పుడు ఆరోపణలతో అధికారులను అడ్డం పెట్టుకుని వెంటనే బెయిల్‌ దొరకని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి చంద్రబాబును, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios