Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో విజయసాయిరెడ్డి భేటీ


ఏపీ, తెలంగాణ మధ్య చోటు చేసుకొన్న జల వివాదాల నేపథ్యంలో  తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేశారు.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతివ్వాలని కోరారు. జల వివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు.  తమ వాదనలను సమర్ధించుకొంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి.

Ysrcp MP Vijayasai Reddy meets union minister Gajendra Shekhawat lns
Author
Guntur, First Published Jul 9, 2021, 10:45 AM IST

న్యూఢిల్లీ:ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో  వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జలవివాదాన్ని  పరిష్కరించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న పరిస్థితులను  విజయసాయిరెడ్డి  కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

also read:ఏపీ వాటా నీటిని తెలంగాణ కాజేస్తోంది, అడ్డుకోండి: కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరుల శాఖ లేఖ

రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు. పాలమూరు -రంగారెడ్డి డిండి ప్రాజెక్టులతో పాటు కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ విస్తరణ ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.కేంద్ర మంత్రి తమ వినతి పట్ల సానుకూలంగా స్పందించారని విజయసాయిరెడ్డి చెప్పారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతోంది.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ యుద్దప్రాతిపదికన నిర్మిస్తోంది.ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని  తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని కూడ తెలంగాణ వ్యతిరేకిస్తోంది.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు,  ఆర్డీఎస్  కుడికాలువ నిర్మాణాన్ని నిరసిస్తూ గజేంద్ర షెకావత్ కు తెలంగాణ సర్కార్ గతంలోనే ఫిర్యాదు చేసింది.రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జలవివాదాలను పరిష్కరించాలని ప్రధానికి జగన్  లేఖలు రాశారు. కెఆర్ఎంబీ పరిధిని గుర్తించాలని కోరుతూ  మరో లేఖను మోడీకి రెండు రోజుల క్రితం జగన్ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios