కన్నాకు విజయసాయి కౌంటర్: కాణిపాకంలోనే కాదు, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తా

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన సవాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. కన్నా సవాల్ కు విజయసాయిరెడ్డి సై అన్నారు.కాణిపాకంలోనే కాదు వెంకటేశ్వరస్వామి సాక్షిగా తాను ప్రమాణం చేసేందుకు తాను సిద్దమేనని ఆయన స్పష్టం చేశారు

Ysrcp Mp Vijayasai Reddy counters to Bjp Ap president Kanna laxmi narayana

అమరావతి: బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన సవాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. కన్నా సవాల్ కు విజయసాయిరెడ్డి 'సై 'అన్నారు.కాణిపాకంలోనే కాదు వెంకటేశ్వరస్వామి సాక్షిగా  ప్రమాణం చేసేందుకు తాను సిద్దమేనని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం నాడు విశాఖపట్టణంలో మీడియాతో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రూ. 20 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.

also read:కరోనా వేళ హీటెక్కిన రాజకీయం...కన్నా, విజయసాయి ట్వీట్ వార్

ఏపీ రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా, మీడియా సమావేశంలో ఇద్దరు కూడ వ్యక్తిగత విమర్శలకు దిగారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రూ. 20 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్దమా అంటూ విజయసాయిరెడ్డికి కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు.

ఈ సవాల్ కు విజయసాయిరెడ్డి స్పందించారు.తాను ఎక్కడా కూడ అవినీతికి పాల్పడలేదన్నారు. అవినీతికి పాల్పడలేదని కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరిలు ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు.

సుజనా చౌదరి బోగస్ కంపెనీలు సృష్టించి వేల కోట్ల రూపాయాలను బ్యాంకులకు ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ అవినీతిపరుడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కన్నాలాంటి వాళ్లు తనను ప్రశ్నించేందుకు అనర్హులని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సమయంలో పార్టీ పంపిన ఫండ్  దుర్వినియోగం జరిగిందని విజయసాయిరెడ్డి చెప్పారు.ఈ విషయమై తన వద్ద ఆధారాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు.సుజనా చౌదరి బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని చెప్పారు. ఈ విషయమై తన వద్ద ఆధారాలున్నాయన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios