ఓ వైపు కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో విలయ తాండవం చేస్తుంది. ఈ వైరస్ బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రజలు అయోమయంలో పడి కొట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రంలో అధికార పార్టీ నేత, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు వాడి వేడీ విమర్శలతో ఏపీ ఇప్పుడు హీటెక్కిపోతోంది.

ఇన్ని రోజులు కామ్ గా ఉన్న నాయకులు మాటల యుద్దానికి దిగారు. వైకాపా సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా రూ. 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని, సుజనా ద్వారా డీల్ జరిగిందని విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదంయ లేకుండా చంద్రబాబులానే కన్నా ఎందుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారో వారినే అడిగతే తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం మధురవాడలో ప్రగతి భారత్ ఫౌండేషన్ సమకూర్చిన నిత్యావసరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కన్నా, చంద్రబాబుల పై మండిపడ్డారు.

ఇప్పటికే తానే ముఖ్యమంత్రి అని చంద్రబాబు భ్రమలో బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం లేదని.. తన కుమారుడు లోకేష్ కి కూడా ఇవ్వడం లేదన్నారు. తమ కుటుంబ సమస్యలు బయటపడకుండా ఉండేందుకు ప్రేలాపనలు చేస్తున్నారని ఆరోపించారు.

కాగా.. తనపై విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ కి కన్నా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి ఆరోపణలను ఏపి బీజేపీ తిప్పికోట్టింది.  ట్విట్టర్ ద్వారా ఘాటు రిప్లై ఇచ్చింది. 

 "సూట్ కేస్ రెడ్డి ,బహుకాలపు జైలు పక్షివి..రాజకీయాల్లో అక్కుపక్షివి.. వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి.. మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది." అంటూ ఏపీ బీజేపీ ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ కి వైసీపీ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.