Asianet News TeluguAsianet News Telugu

సింహాచలం పంచ గ్రామాల వివాదం.. త్వరలో హైకోర్టులో అఫిడవిట్, ఆ 9 వేల ఎకరాలపైనా ఫోకస్: విజయసాయి

విశాఖలోని (visakhapatnam) పంచ గ్రామాల సమస్యపై (pancha gramala land issue) మంత్రులు , స్థానిక ప్రజాప్రతినిధులు కమిటీ భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించిందన్నారు  వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (vijayasai reddy). త్వరలోనే హైకోర్టులో (ap high court) అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు

ysrcp mp vijayasai reddy comments on pancha gramala land issue
Author
Amaravati, First Published Nov 25, 2021, 7:03 PM IST

విశాఖలోని (visakhapatnam) పంచ గ్రామాల సమస్యపై (pancha gramala land issue) మంత్రులు , స్థానిక ప్రజాప్రతినిధులు కమిటీ భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించిందన్నారు  వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (vijayasai reddy) . విజయవాడలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే హైకోర్టులో (ap high court) అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే సింహాచలం దేవస్థానానికి చెందిన 9 వేల ఎకరాల భూమిని కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుందని విజయసాయిరెడ్డి తెలిపారు. 

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampalli srinivas) మాట్లాడుతూ.. పంచ గ్రామాల కేసును కోర్టు త్వరితగతిన డిస్పోస్ చేసేందుకు అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 12,149 మంది స్థానికులకు క్రమబద్ధీకరణ చేసే అంశంపై చర్చించామని ఆయన వివరించారు. కాలం చెల్లిన కట్టడాలకు మరమ్మతులు చేసుకునేలా సింహాచలం ఈవోకు అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. 

Also Read:వైజాగ్ నుంచి సింహాచలం వెళ్లే వాళ్లు ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి..!

పూరి పాకల స్థానంలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించామని.. అలాగే అలాగే 20 కోట్లతో 9 వేల ఎకరాల భూమిలో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని వెల్లంపల్లి పేర్కొన్నారు. పూర్తిగా దాతల నుంచి విరాళాలు తీసుకుని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని.. అలాగే 23 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ కు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. 100 గజాల వరకు ఉచితంగా అలాగే 100 నుంచి 300 గజాల వరకు 75 శాతం .. ఆపై ఆక్రమణలకు వంద శాతం ఫీజుతో క్రమబద్ధీకరణ చేపడతామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై త్వరలోనే కమిటీ చర్చిస్తుందని వెల్లంపల్లి వెల్లడించారు. 

కాగా.. సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్య పరిష్కారానికి గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ , సభ్యులుగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహదారు అజేయకల్లాం, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా సింహాచలం దేవస్థానం ఈవోను నియమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios