టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డాడు

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మంగళవారం వరుస ట్వీట్లు చేసిన ఆయన 'సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్లపాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్‌ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్' అంటూ ఎద్దేవా చేశారు.

Scroll to load tweet…

మరో ట్వీట్‌లో.. 'బట్టలు విడిచిన మూర్ఖపు రాజు.. తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించటం లేదనుకున్నాడట! 175కు 151 ఓడిన, కొడుకును కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు... 13 జిల్లాల్ని తాను అభివృద్ధి చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇప్పుడు చూపిస్తున్నాడట!! షేమ్.. షేమ్.. బాబూ...!' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Scroll to load tweet…