అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభయుడు విజయసాయిరెడ్డి ట్వీట్ల దాడికి దిగారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన పింఛన్ హామీలపై ట్విట్టర్ వేదిక కౌంటర్ వేశారు. 

నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిని ఎన్నికల ముందు తాయిలాలు వేస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. రోగిని కోమాలోకి పంపి వెంటిలేటర్‌ మీద పెట్టినట్లుంది చంద్రబాబు తీరు అని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ ప్రకటించిన రూ.2వేల వృద్ధాప్య పింఛనును కాపీ కొట్టాడని ఆరోపించారు. 

చంద్రబాబు ఎన్ని కొత్త ప్రకటనలు చేసినా నమ్మేవారు లేరు బాబూ’’ అంటూ ట్వీట్ చేశారు. చంద్రన్న కానుకలను పాచిపోయిన బెల్లం, మురిగిపోయిన నెయ్యి అంటూ విమర్శించారు. కుదరదని తెలిసినా జగన్ పై దాడి కేసును ఎన్‌ఐఏ నుంచి తప్పించాలంటూ ప్రధానికి లేఖరాశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును ఎప్పుడు గద్దె దించాలా అన్న ఆలోచనలో ఉన్నారని అది మరో మూడు నెలల్లో కార్యరూపం దాల్చనుందన్నారు. అధికారం విషయంలో చంద్రబాబు కొడుకు లోకేష్ ని సైతం నమ్మడంటూ  విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.