Asianet News TeluguAsianet News Telugu

ముక్కోటి ఏకాదశి.. టీటీడీ అధికారులపై అలిగి వెళ్లిపోయిన వైసీపీ ఎంపీ రెడ్డెప్ప

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం తిరుమల భక్తులతో కిక్కిరిసి పోయింది. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అధికారులపై అలిగి వెళ్లిపోయారు.

ysrcp mp reddeppa went back from tirumala
Author
Tirumala, First Published Jan 13, 2022, 3:46 PM IST

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం తిరుమల భక్తులతో కిక్కిరిసి పోయింది. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అధికారులపై అలిగి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వకుళమాత, నందకం అతిథిగృహాలను కేటాయించారు. 

దీంతో వకుళమాత అతిథిగృహానికి చేరుకున్న రెడ్డెప్ప... తనకు కేటాయించిన గదిలో సరైన సౌకర్యాలు లేవని అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్స్, బెడ్ షీట్లు సరిగా లేవని ఆయన మండిపడ్డారు. వేరే గదిని కేటాయిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆయన శాంతించలేదు. అంతేకాదు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెడ్డెప్పతో పాటు పలువురు ఇతర ఎమ్మెల్యేలు కూడా గదుల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేశారు.

కాగా.. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనంతో తరించాలని భక్తులు దేవాలయాలకు పోటెత్తుతున్నాయి. అయితే corona నిబంధనల దృష్ట్యా.. దేశంలో థార్ద్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని భక్తులను ఎక్కువ సంఖ్యలో అనుమతించడం లేదు. ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శనాలు చేసుకుంటున్నారు.  కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. కరోనా ఉద్ధృతి దృష్ట్యా పలు ఆలయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉద్ధృతితో కొన్ని ఆలయాలు Vaikunthadwara Darshan cancel చేసినట్లు ప్రకటించారు.

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ...
తిరుమలలో బుధవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలొ అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఆ తర్వాత 1:45 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమయింది. బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న సీజేఐ  జస్టిస్ NV Ramana దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు .

గురువారం వేకువజామున భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ 
Krishna Ella, జే ఎం డి సుచిత్ర ఎల్లా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు Bharat Biotech  సంస్థ రెండు కోట్ల రూపాయలు విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన డిడీలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. దేవస్థానం ఈవో జవహర్ కు అందజేశారు.

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు…
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా దంపతులు.. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్నాథ్ గౌడ్ దంపతులు, హైకోర్టు జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కృష్ణమోహన్ జస్టిస్ దుర్గాప్రసాద్,  జస్టిస్ రమేష్,  ఏపీ  ఉప ముఖ్యమంత్రి  నారాయణస్వామి,  మంత్రులు జయరాం,  వెల్లంపల్లి శ్రీనివాస్, రంగనాథ రాజు, సురేష్, బాలినేని అనిల్ యాదవ్ దంపతులు,  అవంతి శ్రీనివాస్ దంపతులు, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి,  మార్గాని భరత్, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణి రెడ్డి,  ఎంపీ సీఎం రమేష్ దంపతులు,  మాజీ మంత్రి చినరాజప్ప, లక్ష్మీపార్వతి,  తెలంగాణ మంత్రి హరీష్ రావు దంపతులు,  మరో మంత్రి గంగుల కమలాకర్  స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios