Asianet News TeluguAsianet News Telugu

మీరైనా నా కేసు త్వరగా విచారించండి.. ఏపీ కొత్త డీజీపీకి రఘురామకృష్ణంరాజు లేఖ

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా (ap dgp) బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి (kasireddy rajendranath reddy) వైసీపీ (ysrcp) రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (raghu rama krishnam reddy) ఆదివారం లేఖ రాశారు. తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని ఆయన డీజీపీని కోరారు. 

ysrcp mp raghurama krishna raju wrote ap dgp rajendranath reddy
Author
Amaravathi, First Published Feb 20, 2022, 3:37 PM IST

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా (ap dgp) బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి (kasireddy rajendranath reddy) వైసీపీ (ysrcp) రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (raghu rama krishnam reddy) ఆదివారం లేఖ రాశారు. తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని ఆయన డీజీపీని కోరారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసలకు గురిచేశారని లేఖలో డీజీపీకి వెల్లడించారు. తనపై దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నారని రఘురామ ఆరోపించారు. ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదని ఎంపీ మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్ కోరిన మేరకు నివేదికను త్వరగా పంపాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాత రీతిలో దర్యాప్తు జరపాలన్నారు. 

ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌ను (gautam sawang) బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూత‌న డీజీపీగా బాధ్యతలు అప్ప‌జెప్పిన విష‌యం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సవాంగ్‌ సేవలు గుర్తించి ప్రభుత్వం ఆయనకు మరో బాధ్యతను అప్పగించిందన్నారు. సవాంగ్ వీడ్కోలు సందర్భంగా నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..   మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పనితీరు తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుంది. ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుంది. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదు. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి.

త‌న‌ పై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని ఆయన వెల్లడించారు. ఆ నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే అని అన్నారు. జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుందని.., ఆ నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు. ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ చేస్తామని, పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios