Asianet News TeluguAsianet News Telugu

క్షవరం అయితేగాని వివరం రాలేదు.. ఏపీ ఉద్యోగ సంఘాల పరిస్ధితి ఇది : రఘురామ వ్యాఖ్యలు

వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసిందని... ఉద్యోగులకు సీఎం జగన్‌ శఠగోపం పెట్టారని రఘురామ విమర్శించారు. క్షవరం అయితేగాని వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని.. అందరూ దివాళా తీసి కొంపలు అమ్ముకోవాలన్నట్లుగా ఉందంటూ సెటైర్లు వేశారు.

ysrcp mp raghu rama krishnam raju slams ap govt
Author
Amaravathi, First Published Jan 13, 2022, 2:38 PM IST

వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు, భయపడుతున్న వైసీపీ నేతలను మార్చుకోవాలని జగన్‌కు రఘురామ సూచించారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారిని తెచ్చుకోవాలని ఆయన కోరారు. 

క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసిందని... ఉద్యోగులకు సీఎం జగన్‌ శఠగోపం పెట్టారని రఘురామ విమర్శించారు. క్షవరం అయితేగాని వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని.. అందరూ దివాళా తీసి కొంపలు అమ్ముకోవాలన్నట్లుగా ఉందంటూ సెటైర్లు వేశారు. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా.. అనేలా పరిస్థితులు ఉన్నాయని రఘురామ అన్నారు. ప్రస్తుతం ఉన్న పీఆర్‌సీ కొనసాగితే చాలు అనేలా ఉద్యోగులు భావిస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ వ్యాఖ్యానించారు. తనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు పోరాడాలని.. నియోజకవర్గ ప్రజలు తనను మళ్లీ గెలిపించాలని రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు ఈ నెల 17న తనను విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని  రఘురామకృష్ణంరాజు నిన్న చెప్పారు. బుధవారం ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు తీసుకొన్న తర్వాత Raghu Rama krishnam Raju బుధవారం నాడు Hyderabad గచ్చిబౌలిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

రెండున్నర ఏళ్ల తర్వాత తాను తన స్వంత నియోజకవర్గానికి వెళ్లే సమయంలో విచారణకు రావాలని Cid అధికారులు కోరుతున్నారన్నారు. ఇవాళ నోటీసులు ఇచ్చి రేపే విచారణకు రావాలంటే ఎలా అని తాను సీఐడీ అధికారులను ప్రశ్నించానన్నారు. దీంతో ఈ నెల 17న విచారణకు రావాలని సీఐడీ అధికారులు తనకు చెప్పారన్నారు. గతంలో తనపై నమోదైన కేసుల్లో మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరారని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

తనకు చట్టం, న్యాయం, రాజ్యాంగం అంటే గౌరవం ఉందన్నారు. ఇన్నాళ్లూ అడగకుండా పండుగ రోజుల్లోనే తనను విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కి, ఏపీ సీఎం Ys Jagan కు సంక్రాంతి పండగ ప్రాశ్యస్త్రం ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. గతంలో తనను  అరెస్ట్ చేసిన సమయంలో  సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఈ సమయంలో కార్యాలయంలో ఉన్న cctvలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. తనపై దాడి చేసే సమయంలో తన సెక్యూరిటీని ఎందుకు అనుమతించలేదో చెప్పాలన్నారు. ఈ విషయమై తాను Supreme courtలో మరోసారి విచారణ చేయాలని కోరుతానని చెప్పారు.

గత ఏడాది మే మాసంలో సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజుపై కేసులు నమోదు చేశారు.ఈ కేసులో సుప్రీంకోర్టు అదే నెల 21న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో విచారణకు సహకరించాలని కూడా సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజును కోరింది. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు హాజరు కావాలని కోరినా రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ కేసు విషయమై మరింత సమాచారం కోసం విచారణకు రావాలని ఎంపీకి నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios