Asianet News TeluguAsianet News Telugu

అన్ని అక్రమాలే.. ఏపీ ఫైబర్ నెట్ లైసెన్స్ రద్దు చేయండి: కేంద్రానికి రఘురామ లేఖ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ అక్రమ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేసి, చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ తప్పుడు సమాచారాన్ని పంపిణీ చేస్తోందని... దాన్ని కూడా అడ్డుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. 

ysrcp mp raghu rama krishnam raju letter to center over ap fibrenet
Author
Amaravati, First Published Aug 31, 2021, 9:00 PM IST

కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మంగళవారం లేఖ రాశారు. ఏపీలో ఫైబర్ నెట్ సంస్థపై ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ సంస్థ అనధికారికంగా, అక్రమంగా ఎంఎస్ఓ లైసెన్సును ఉపయోగిస్తోందని రఘురామ లేఖలో ప్రస్తావించారు. ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధమని ఎంపీ పేర్కొన్నారు.

Also Read:విదేశాలకు పారిపోతోంది ఎవరు: విజయసాయిరెడ్డిపై రఘురామ వ్యాఖ్యలు

బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎంఎస్ఓలు లైసెన్సులు పొందలేవని... అందువల్ల లైసెన్స్‌ను అక్రమంగా వాడుతున్న ఫైబర్ నెట్ ను అనర్హత జాబితాలో చేర్చాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. ఏపీ ఫైబర్ నెట్ అక్రమ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ తప్పుడు సమాచారాన్ని పంపిణీ చేస్తోందని... దాన్ని కూడా అడ్డుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios