పక్కా ప్లాన్‌తోనే సీఎం జగన్ లండన్ వెళ్లారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలు పిచ్చోళ్లు అనుకుని వైసీపీ నేతలు ఏవేవో పిట్ట కథలు చెపుతున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. జగన్ దావోస్ పర్యటన వల్ల ఏపీకి సాధించేది ఏం లేదన్నారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం లండన్‌లో ల్యాండ్ అవ్వడంపై వివాదం కొనసాగుతూనే వుంది. దీనిపై శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) క్లారిటీ ఇచ్చినా ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తూనే వున్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (raghu rama krishnam raju) సైతం ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ తోనే జగన్ లండన్ కు వెళ్లారని ఆరోపించారు. జనాలు పిచ్చోళ్లు అనుకుని వైసీపీ నేతలు ఏవేవో పిట్ట కథలు చెపుతున్నారంటూ దుయ్యబట్టారు. దావోస్ కు వెళ్లి జగన్ రాష్ట్రానికి సాధించేది ఏమీ లేదని... ఏపీలో ఆరోగ్యరంగం గురించి దావోస్ లో జగన్ అన్నీ అబద్ధాలు చెప్పారని రఘురామ మండిపడ్డారు. 

తనపై వేసిన అనర్హత పిటిషన్ గురించి ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ చెప్పిన దాంట్లో పస లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ను తాను ఎప్పుడూ తిట్టలేదని, వైసీపీకి వ్యతిరేకంగా కూడా తాను ఎప్పుడూ మాట్లాడలేదని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడంలో తప్పులేదని ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రిగా ఉల్లంఘిస్తున్నారని .. అందుకే ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపాల్సి వస్తోందని రఘురామ మండిపడ్డారు. 

ALso Read:లండన్‌లో జగన్‌ ల్యాండింగ్‌ ‌: ఆయన మెంటల్ కండీషన్ బాలేదు.. అయ్యన్నకు విజయసాయిరెడ్డి కౌంటర్

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు అనర్హులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. చంపిన తర్వాత మృతుడిని అనంతబాబు కొట్టినట్టు పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతబాబు ప్రాణాలకు ముప్పు ఉందని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై (jagan davos tour) టీడీపీ నేత (tdp) అయ్యన్నపాత్రుడు (ayyanna patrudu) చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy). ''అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది. మెదడుకి, నాలుకకు మధ్య ‘హుందాతనం’ అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్ సిద్ధం చేయక తప్పేలా లేదు. ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల బాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే తయారైంది'' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

అంతేకాదు... ''దావోస్ వెళ్లి బాబు ఏం చేశాడో, ఏం తీసుకొచ్చాడో ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. పాత వీడియోలు చూస్తే రాష్ట్రం పరువు తీసొచ్చాడని మాత్రం అర్థమవుతోంది. తన పాలనలో నేరాలే జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 2016-19 మధ్య రాష్ట్రంలో 1,44,703 నేరాలు నమోదైనట్టు ఎన్‌సీఆర్బీ వెల్లడించింది'' అని ఆయ‌న దుయ్యబట్టారు.