Asianet News TeluguAsianet News Telugu

గన్నవరంలో పట్టాభికి ఏం పని.. ఘర్షణల వెనుక చంద్రబాబు హస్తం : మోపిదేవి వెంకట రమణ వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయం దగ్థం, ఘర్షణలపై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ స్పందించారు. గన్నవరం ఘటన వెనుక చంద్రబాబు హస్తం వుందని.. అసలు పట్టాభికి గన్నవరంలో ఏం పని అని మోపిదేవి ప్రశ్నించారు. 
 

ysrcp mp mopidevi venkata ramana slams tdp chief chandrababu naidu over gannavaram incident
Author
First Published Feb 23, 2023, 8:25 PM IST

కృష్ణా జిల్లా గన్నవరంలో ఘర్షణలకు సంబంధించి వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరంలో కావాలనే అలజడులు సృష్టించారని అన్నారు. స్థానిక నేతలతో పట్టాభి గొడవలు సృష్టించారని.. గన్నవరంలో పట్టాభికి ఏం పని అని మోపిదేవి ప్రశ్నించారు. గన్నవరం ఘటన వెనుక చంద్రబాబు హస్తం వుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పట్టాభి పాత ఫొటోలతో ఈనాడు రామోజీరావు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కొడాలి నాని ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, వైఎస్సార్ ఉన్నప్పుడు రాసినట్టుగా ఈనాడు పిచ్చి రాతలు రాస్తే ఊరుకునేది లేదని అన్నారు. వైఎస్సార్ సాక్షి పెట్టి.. రామోజీరావు మెడలు వంచి ఇంట్లో కూర్చొబెట్టాడని చురకలంటించారు. చంద్రబాబును  సీఎం చేయడమే రామోజీరావు లక్ష్యమని  ఆయన విమర్శించారు. తప్పుడు రాతలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం జగన్‌కు, రాష్ట్ర ప్రజలకు ఈనాడు రామోజీరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన రీతిలో ఖండన ఇవ్వాలని కొడాలి నాని అన్నారు. 

ALso REad: సీఎం జగన్‌కు రామోజీరావు క్షమాపణ చెప్పాలి.. పట్టాభి ఏమైనా ఆకాశంలో దిగొచ్చాడా?: కొడాలి నాని

టీడీపీ నేత పట్టాభి ఏమైనా ఆకాశంలో దిగొచ్చాడా? అని ప్రశ్నించారు. పట్టాభి మీడియా ముందుకు వచ్చి చెప్పేవి అబద్దాలు అని విమర్శించారు. పోలీసులు దాడి చేశాడని పట్టాభి కోర్టులో అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. పట్టాభిని గన్నవరం ఎవరూ పంపించారని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులలో 14 మంది వెనకబడిన వర్గాలకు చెందినవారేనని.. వైసీపీ ఎమ్మెల్సీలను ప్రకటిస్తున్న రోజే పట్టాభి గన్నవరానికి ప్లాన్ ప్రకారమే వచ్చాడని నాని ఆరోపించారు. 

వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా పట్టాభి మాట్లాడటారని అన్నారు. పోలీసు స్టేషన్ వద్ద పోలీసులపై పట్టాభి దాడి చేశారని ఆరోపించారు. పట్టాభి భుజంపై జెండా కర్ర పట్టుకుని వెళ్లాడని.. సీఐని కొట్టిన కూడా కేసు పెట్టకూడదా? అని ప్రశ్నించారు. పట్టాభిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రెస్ మీట్ చెబుతారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. పట్టాభిని అరెస్ట్ చేసినట్టుగా చంద్రబాబు ఇంటికెళ్లి చెప్పాలా? అంటూ ఫైర్ అయ్యారు. 

ALso REad: పోలీసులు కొట్టలేదు.. పట్టాభి చెప్పినదంతా అబద్ధమే, మా వాళ్లపై నిందలొద్దు : కృష్ణా జిల్లా ఎస్పీ

పట్టాభి పనికిమాలిన 420 అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు ఎక్కడా కూడా గాయాలు  కాలేదని కొడాలి నాని అన్నారు. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో సీఐ గాయపడితే.. పోలీసులపై అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు లేకపోతే పట్టాభిని చంపి పక్కన పడేసేవారని అన్నారు. సీఎం జగన్, వైసీపీని తిట్టి.. టీడీపీలో ఎదగాలని పట్టాభి చూస్తున్నారని నాని విమర్శించారు. టీడీపీ ఆఫీసు వద్ద కారును ఎవరో తగలబడితే రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మీద బురద  జల్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios