చంద్రబాబుపై నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది.. గోరంట్ల మాధవ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పద దోషంతోనే చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని గోరంట్ల మాధవ్ తెలిపారు. తాను అన్న వ్యాఖ్యలను మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు వక్రీకరించారని చెప్పారు.
ఇటీవల, వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా హిందూరం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తారని.. ఇది గ్యారంటీ అని అన్నారు. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర కలకలం రేపింది. గోరంట్ల వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబును అంతమొందించేందుకు వైసీపీ ప్రణాళికలు రూపొందించారని చెప్పడానికి ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.