తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక: వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నామినేషన్

తిరుపతి:తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ) అభ్యర్ధిగా బరిిలో దిగిన  డాక్టర్ గురుమూర్తి  సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్  అనారోగ్యంతో గత ఏడాది మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

ఈ స్థానం నుండి తమ పార్టీ అభ్యర్ధిని డాక్టర్ గురుమూర్తిని సీఎం జగన్ ఖరారు చేశారు.  డాక్టర్ గురుమూర్తి  సోమవారం నాడు పార్టీ నేతలు, మంత్రులు వెంటరాగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్ధిగా రిటైర్ట్ ఐఎఎస్ అధికారి రత్నప్రభను ఆ పార్టీ బరిలోకి దింపింది.ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఈ స్థానంలో విజయం సాధించడం కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.

టీడీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా రాబిన్ శర్మ వ్యవహరిస్తున్నారు.  ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. విపక్షాలకు నామమాత్రంగానే సీట్లు దక్కాయి.