తిరుపతి: తిరుపతి ఐఐటీ మెుదటి స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరైన ఎంపీ దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు అర్థాంతరంగా వెనక్కి వెళ్లిపోయారు. స్నాతకోత్సవంలో ఐఐటీ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం చెందిన వారు కార్యక్రమాల్లో పాల్గొనకుండా  వెళ్లిపోయారు. 

ఎంపీ బల్లిదుర్గా ప్రసాద్ తోపాటు ఎహ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు సైతం వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఐఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్. 

అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కనీసం ఆహ్వానంలో పేర్లు కూడా సరిగ్గా వేయలేదన్నారు. తిరుపతికి ఐఐటీ వచ్చిందనే ఆనందమే తప్ప అందులో తెలుగువారు ఎవరూ లేరంటూ ఆరోపించారు ఎంపీ బల్లి దుర్గాప్రసాద్.