Asianet News TeluguAsianet News Telugu

పైకి పాల వ్యాపారం.. లోపల లిక్కర్ బిజినెస్ : చంద్రబాబు ఫ్యామిలీపై పోతుల సునీత ఆరోపణలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత. బాబు 200లకు పైగా బ్రాండ్‌లు తెచ్చి మద్యాన్ని ఏరులై పారించారని.. భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం వచ్చిందని ఆమె ఆరోపించారు
 

ysrcp mlc pothula sunitha sensational comments on tdp chief chandrababu naidu and his family
Author
First Published Sep 4, 2022, 5:05 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే డిస్టలరీలు, బ్రూవరీలకు అనుమతులు వచ్చాయన్నారు. బీ 3 బ్రాండ్లు అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అంటూ సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు 200లకు పైగా బ్రాండ్‌లు తెచ్చి మద్యాన్ని ఏరులై పారించారని.. భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం వచ్చిందని ఆమె ఆరోపించారు. పైకి పాల వ్యాపారం .. తెరవెనుక సారా పరిశ్రమ నిర్వహిస్తున్నారని సునీత ఆరోపించారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని.. సారా చంద్రబాబని వ్యాఖ్యానించారు. ఒక వంక మగువ.. మరోవంక మద్యం, ఇదే పప్పు బ్రాండ్ అంటూ సునీత అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వానికి ఆపాదిస్తూ టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని... అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ సారా వ్యాపారంతో కోట్లు సంపాదించిందని సునీత ఆరోపించారు. 

ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి సైతం చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శలు గుప్పించారు. భువనేశ్వరి, బ్రాహ్మణికి సంబంధించిన అన్ని విషయాలు మాకు తెలుసునని కళ్యాణి హెచ్చరించారు. వైఎస్ భారతి గురించి ఏమైనా మాట్లాడితే నాలుక కోస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ భారతి ఏ రోజైనా రాజకీయాలు మాట్లాడారా అని కళ్యాణి ప్రశ్నించారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు ఈరోజు 2 లక్షల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు.. కేవలం పాల వ్యాపారం వల్లేనంటే ఎవరైనా నమ్ముతారా అని ఆమె నిలదీశారు. దీని వెనుక భువనేశ్వరి, బ్రాహ్మణిల లిక్కర్ వ్యాపారం వుందని కళ్యాణి ఆరోపించారు. 

ALso REad:నారా భువనేశ్వరి, బ్రాహ్మణి దందాలన్నీ తెలుసు.. భారతి గురించి మాట్లాడితే నాలుక కోస్తాం: వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి

జగన్ సీఎం అయ్యాక.. ఒక్క డిస్టిలరీకైనా అనుమతులు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక 44 వేల బెల్ట్ షాపులు రద్దు చేశారని.. 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించారని .. 4,500 పర్మిట్ రూమ్‌లను తొలగించారని కల్యాణి గుర్తుచేశారు. పర్మిట్ రూమ్‌లను చంద్రబాబు హయాంలోనే ఏర్పాటు చేశారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే.. ఆయన కడుపున పుట్టిన భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారని కళ్యాణి ఆరోపించారు. 

లిక్కర్ సిండికేట్ నుంచి భువనేశ్వరి వందలకోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆరోజున భువనేశ్వరి ముడుపులు తీసుకున్నారు కాబట్టే.. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారని కల్యాణీ ఆరోపించారు. ముడుపుల కోసం భువనేశ్వరి, బ్రాహ్మణి గొడవ పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అది నారా కుటుంబం కాదని.. సారా కుటుంబమని కల్యాణి అభివర్ణించారు. ఎస్‌పీవై రెడ్డి డిస్టలరీ నుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి ఎన్ని ముడుపులు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios