గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా తర్వాత అంతటి గ్లామర్, అంతటి దూకుడు కలిగిన నాయకురాలు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ. విడదల రజనీ ఏం చేసినా వెరైటీగానే చేస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇంకా చెప్పాలంటే నియోజకవర్గంలో విడదల రజనీ ఒక ఫైర్ బ్రాండ్. నిత్యం ఏదోఒక కార్యక్రమంతో మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. దాంతో విడదల రజనీకి ఎక్కడా లేని క్రేజ్ వచ్చి పడుతోంది. ఇకపోతే సోషల్ మీడియా గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 

అంతేకాదు విమర్శలు చేయడంలో కూడా తనకు తానే సాటి. అలా అన్నిరంగాల్లో దూకుడుగా ఉంటూ ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. దాంతో ప్రతీఒక్కరి నోట్లో ఆమె పేరు నాన్తోంది. దాంతో ఆమె ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

ఇలాంటి తరుణంలో విడదల రజనీ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే విడదల రజనీ స్పీచ్ కు ఫిదా అయ్యారు చిన్నారులు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్తుండగా చిన్నారులు ఆమెతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. 

ప్రతీ ఒక్క విద్యార్థికి ఆమె షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంతలో ఒక విద్యార్థి ఆమె బుగ్గ గిల్లాడు. ఆ బుగ్గ గిల్లిన చేతిని ముద్దాడాడు. ఆ బుడతడు చేసిన పనికి ఒక్కసారిగా అవాక్కయ్యారు ఎమ్మెల్యే విడదల రజనీ. ఆ బుడ్డోడిని చూసి నవ్వుకున్నారు. 

"

ఈ వార్తలు కూడా చదవండి

క‌ష్టాన్ని చూసి, కారు దిగి.. చీపుర్లను మోసిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని