Asianet News TeluguAsianet News Telugu

ఆ ఫుటేజీ బయటపెడితే... చంద్రబాబు చిప్పకూడు తినేవాడు..: వైసిపి ఎమ్మెల్యే రోజా సంచలనం (వీడియో)

భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తూ వైసిపి సర్కార్, సీఎం జగన్ ను విమర్శిస్తున్న టిడిపి చీఫ్ చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. 

YSRCP MLA Roja fires on TDP Chief Chandrababu
Author
Amaravati, First Published Nov 25, 2021, 1:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఇటీవల భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన జిల్లాల్లో పర్యటిస్తూ టిడిపి చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై చేసిన కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ గా కౌంటరిచ్చారు. చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. కుప్పం దెబ్బకు చంద్రబాబు కు పిచ్చెక్కిందని... అందుకే ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ రోజా సెటైర్లు వేసారు. 

గతంలో chandrababu హయాంలో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి YSRCP MLA Roja ప్రస్తావించారు. ఈ తొక్కసలాట సీసీ ఫుటేజీ బయటపెడితే చంద్రబాబు చిప్పకూడు తినేవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పుష్కరాల్లో షూటింగ్ కోసం ఎంత మందిని బలి తీసుకున్నావంటూ రోజా నిలదీసారు.

వీడియో

ప్రస్తుతం TDP Chief చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తూ డ్రామాలు ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. గతంలో మహిళలను ఏడిపించిన చంద్రబాబు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు లాగా ప్రవచనాలు చెబుతున్నారని రోజా ఎద్దేవా చేసారు. 

read more  ‘‘ సీమ ’’కు మరో వానగండం... జగన్ సమీక్ష, ఏపీలో వరదల వల్ల జరిగిన నష్టమెంతో తెలుసా..?

వరదలతో ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే cm ys jagan ఏరియల్ సర్వే చేస్తారా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా స్పందించారు. ఇప్పటికే వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న జనం దగ్గరకు వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే సీఎం airial survey కు వెళ్లారని వివరించారు. అయినా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేయలేదా...? అని రోజా నిలదీసారు. జగన్ ఏరియల్ సర్వేపై చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా వుందని రోజా అన్నరు. 

ఎల్జీ పాలిమార్ ఘటన బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్.. భారీ వర్షాలు, వరదలతో సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులైతే రూ.5 లక్షలు ప్రకటిస్తారా అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు రోజా కౌంటరిచ్చారు. చంద్రబాబు హయాంలో ఎవరికైనా కోటి రూపాయలు పరిహారం ఇచ్చారా అని నిలదీసారు.  

read more  Heavy rains in AP: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ, రూ. 1000 కోట్లివ్వాలని వినతి

''వరద బాధితుల దగ్గర అసెంబ్లీలో అనని మాటలు ఎలా చెప్తావు. తాను చెప్పేదంతా ప్రజలు నమ్ముతారనుకోవడం చంద్రబాబు పొరపాటే. నీ మాటలు శాడిజంకు పరాకాష్ట. వరదలు మానవ తప్పిదం ఎలా అవుతుందో చెప్పాలి. ఓపిక ఉంటే వరద బాధితులకు సహాయం చేయండి. అనవసర రాజకీయాలు వద్దు'' అని రోజా హితవు పలికారు. 

''జగన్ ఉన్నంతవరకూ నువ్వు ముఖ్యమంత్రి కాలేవు... నీ కొడుకు ఎమ్మెల్యే కాలేడు. సోనియా తో కుమ్మక్కై జగన్ పై తప్పుడు కేసులు పెట్టించావు. కానీ ఇప్పుడు సోనియా గాంధీ నుంచి శంకర్రావు వరకూ ఏమయ్యారో తెలుసుకో'' అంటూ రోజా చంద్రబాబును హెచ్చరించారు.

ఇదిలావుంటే వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు సీఎం జగన్ ఏరియల్ సర్వే, బాధితులకు అందిస్తున్న పరిహారంపై కామెంట్ చేసారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించక పోవడం దుర్మార్గమని.. నాడు ఓట్ల కోసం రోడ్లు పట్టుకొని తిరిగిన జగన్ సీఎం అయ్యాక ఏరియల్ సర్వేతో సరి పెట్టుకోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాలకు రూ.25లక్షల మేర పరిహారం అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios