ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై పంచ్‌లు వేశారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తే చిన్న మెదడు చితికిపోయినట్లు అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు.

గతంలో జరిగిన వాటితో ఎలా పోల్చి చిత్తూరు, గుంటూరు ఎస్పీ,కలెక్టర్‌లను మార్చి ఎన్నికలు నిర్వహించారని, ఇప్పటికీ ఏకగ్రీవాలు అయితే పునః పరిశీలన చేయాలని చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

నిమ్మగడ్డకు ఆయనపైనే నమ్మకం లేకుండా పోయిందా...?? అని రోజా ప్రశ్నించారు. ఆయనకు నచ్చిన వారినే తెచ్చిపెట్టుకుంటున్నారని.. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ ఎలా పనిచేస్తున్నాడని చెప్పడానికి ఇదోక ఉదాహరణ అని రోజా ఎద్దేవా చేశారు.

ప్రజలు చేసుకున్న ఏకగ్రీవాలను గౌరవించాలని ... వాటిని హాస్యాస్పదం చేయొద్దని రోజా హితవు పలికారు. అని ఆమె కోరారు. కాగా, చిత్తూరు జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలకు బ్రేక్ వేసింది ఎన్నికల కమీషన్..

జిల్లాల్లో 454 పంచాయతీలకు గాను 110  ఏకగ్రీవాలు నమోదయ్యాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల కమీషన్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని స్పష్టం చేసింది.