వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతమన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా. శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రసంగించిన ఆమె... సీఎం జగన్ మహిళల పక్షపాతి అని ప్రశంసించారు.

టీవీలో ఎలా కనిపించాలన్నది చంద్రబాబు విజనైతే... ప్రజలకు ఉజ్వల భవిష్యత్ కల్పించాలన్నది జగన్ విజన్ అని రోజా అన్నారు. చంద్రబాబుది 420 విజన్... జగన్ విజన్ ఓ విప్లవమని, తర్వాతి తరాల గురించి ఆలోచించే ప్రజా నాయకుడు జగన్ అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రతి ఆడ బిడ్డను రక్షించే దిశ చట్టంతో పాటు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన జగన్ ఓ క్రియేటర్ అని రోజా ప్రశంసించారు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు చేసిందేమీ లేదని.. టీడీపీ, చంద్రబాబును జగన్ షేక్ చేశారని రోజా సెటైర్లు వేశారు.

పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేశారని... పేదవాళ్లకు ఇచ్చే ఇళ్లపై కూడా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.