చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చితక్కొట్టారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన ఆమె నగరి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో నగరి ప్రీమియర్ లీగ్ టోర్నీని ప్రారంభించారు. ప్రారంభించి వెళ్లిపోతున్న ఆమెను బ్యాట్ పట్టాలని క్రీడాకారులు, అభిమానులు ఒత్తిడి తీసుకువచ్చారు.  

అభిమానుల కోరికతోపాటు క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు రోజా బ్యాట్ పట్టారు. రెండు బంతులు మాత్రమే ఆడతానంటూ దిగిన ఆమె ఒక ఓవర్ ఆడేశారు. ప్రతీ బాల్ ని బౌండరీకి తలరించారు. దీంతో రోజాను వండర్ ఫుల్ క్రికెటర్ అంటూ ప్రశంసించారు. 

అటు వైసీపీ కార్యకర్తలు, ప్రజలు, క్రీడాకారులు రోజా బ్యాట్ పట్టినంత సేపు విజిల్స్ వేస్తూ నానా హంగామా చేశారు. అనంతరం రోజా క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పి మరోక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. రోజా ఉన్నంత సేపు కళాశాల గ్రౌండ్ లో సందడి నెలకొంది.