Asianet News TeluguAsianet News Telugu

కులాంతర వివాహం.. దగ్గరుండి కూతురి ప్రేమ పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురు పెళ్లి విషయంలో ఆదర్శవంతంగా వ్యవహరించారు. మరో కులానికి చెందిన వ్యక్తిని కూతురు ప్రేమించిన విషయం తెలిసిన.. వారి పెళ్లికి ఎలాంటి అడ్డుచెప్పలేదు. అంతేకాకుండా దగ్గరుండి వారి వివాహం చేశారు.

YSRCP MLA Rachamallu Siva Prasad Reddy inter caste Love Marriage ksm
Author
First Published Sep 7, 2023, 3:44 PM IST

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురు పెళ్లి విషయంలో ఆదర్శవంతంగా వ్యవహరించారు. మరో కులానికి చెందిన వ్యక్తిని కూతురు ప్రేమించిన విషయం తెలిసిన.. వారి పెళ్లికి ఎలాంటి అడ్డుచెప్పలేదు. అంతేకాకుండా దగ్గరుండి వారి వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూతురు పల్లవి చదువుకునే రోజుల్లో  గోపీ పవన్ కుమార్‌తో ప్రేమలో పడింది. అయితే కూతురు అభిష్టం మేరకు ప్రేమించిన వ్యక్తితోనే ఆమె పెళ్లి జరిపించేందుకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  నిర్ణయం తీసుకున్నారు. అయితే పల్లవి కోరిక మేరకు.. ఈ పెళ్లిని కూడా అత్యంత నిరాడంబరంగా జరిపించారు. 

తొలుత  సాంప్రదాయ బద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మధ్య వివాహం జరిగింది. అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా వచ్చారు. ఇక, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వివాహం గురించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రొద్దుటూరు ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. నా కుటుంబానికి సంబంధించిన సంతోషకరమైన వార్తతో మీ ముందుకు వచ్చాను. నాకు ఇద్దరు కూతుళ్లు. ఈరోజు నా మొదటి కూతురు వివాహాన్ని నిరాడంబరంగా చేయడం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో కులాంతర వివాహం జరిపించాను. ఇందుకు నేను సంతోషిస్తున్నాను.. అలాగే గర్వపడుతున్నాను. 

నా కూతురు చదువుకునే సమయంలో ఆమెతో పాటు చదువుకునే ప్రొద్దుటూరుకు చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. ఆ అబ్బాయితో తన జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పింది. ఈ విషయం తెలిసినప్పుడు.. కులాంతర వివాహం, యువకుడు ఆర్థికంగా పేదవాడు కావడం, సామాజిక మన స్థాయి కాదని శ్రేయాభిలాషులకు నాకు చెప్పారు. అయితే కులాల పట్ల నాకు పట్టింపులు లేవు. కులాల కంటే గుణమే గొప్పది. పెళ్లి కొడుకు తండ్రి ఆర్టీసీ‌లో చిన్న మెకానిక్.. అయితే నేను డబ్బుకు ఎలాంటి ప్రాధాన్యత వ్యక్తిని కాదు. డబ్బుకు ఎలాంటి వ్యక్తిని కాదని.. అందుకే నా కూతురుకు నచ్చిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశాను. సామాజిక స్థాయి గురించి ప్రస్తావించినప్పుడు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు సంతోషంగా ఉండటమే ముఖ్యమని చెప్పాను. 

స్థాయిని, డబ్బును, కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నా కూతురు ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేశాను. చాలా గొప్పగా పెళ్లి చేద్దామంటే ఒప్పుకోకపోవడంతో.. ఆమె కోరుకున్న విధంగానే సింపుల్‌గా పెళ్లి చేయడం జరిగింది. ఆడపిల్లలకు అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి నిర్ణయాలు బాగోలేకపోతే.. సూచనలు చేయడమే మన బాధ్యత. నా బిడ్డ కులాంతర వివాహాన్ని సంతోషంగా చేశాను. అబ్బాయి ఎంబీఏ చేశాడు. హైదరాబాద్‌లోని కంపెనీలో రూ. 80 వేల జీతానికి పనిచేస్తున్నాడు. చదువు, ఉద్యోగం‌కు ప్రాధాన్యత ఇచ్చే ఈ వివాహాన్ని జరిపించాను. నా కూతురు వివాహాన్ని అంగీకరిస్తారని.. ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios