Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న వైసీపీ ఎమ్మెల్యే: జగన్, మోడీల కన్నా గొప్పనా?

:తూర్పుగోదావరి  జిల్లాలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యే  పూర్ణచంద్రప్రసాద్ తన ఇంటికే వైద్య సిబ్బందిని పిలిపించుకొని కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
 

Ysrcp MLA Purnachandra Prasad takes corona vaccine at his Residence lns
Author
East Godavari, First Published Apr 8, 2021, 1:35 PM IST

కాకినాడ:తూర్పుగోదావరి  జిల్లాలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యే  పూర్ణచంద్రప్రసాద్ తన ఇంటికే వైద్య సిబ్బందిని పిలిపించుకొని కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.ఎమ్మెల్యే కరోనా వ్యాక్సిన్ వేసుకొనేందుకు శంఖవరం పీహెచ్‌సీ సిబ్బందిని తన ఇంటికి పిలిపించుకొని  వ్యాక్సిన్ వేయించుకొన్నాడు.సాధారణంగా పీహెచ్‌సీల్లోనే కరోనా వ్యాక్సిన్ వేయించుకొంటున్నారు. ప్రధాని మోడీ ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నాడు.

ఏపీ సీఎం వైఎస్ జగన్  వార్డు సచివాలయానికి వెళ్లి  కరోనా వ్యాక్సిన్ వేసుకొన్నారు. తన భార్యతో కలిసి వెళ్లి  ఆయన వ్యాక్సిన్ తీసుకొన్నాడు. కానీ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్  మాత్రం  తన ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ ఎయిమ్స్ కు వెళ్లి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. పూర్ణచంద్ర ప్రసాద్ జగన్, మోడీల కన్నా గొప్పవారా అని ప్రశ్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios