Asianet News TeluguAsianet News Telugu

సినిమా వాళ్ల మీద వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు...

సినిమా వాళ్లంతా హైదరాబాద్ లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. బలిసి కొట్టుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ysrcp mla nallapareddy prasanna kumar reddy sensational comments on tollywood
Author
Hyderabad, First Published Jan 10, 2022, 2:10 PM IST

అమరావతి : టాలీవుడ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే nallapureddy prasanna kumar reddy వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. cinema వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు సినిమా వారికి andhrapradesh అంటే గుర్తుందా? అని ప్రశ్నించారు. ticket rates తగ్గిస్తే సామాన్యలు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పంటేని ఆయన సమర్థించుకున్నారు. 

కాగా మంత్రి perni nani, దర్శకుడు ram gopal varma భేటీ సయంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తరచుగా ఎవరో ఒకరిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు.

సోమవారం కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సినిమా వాళ్ల గురించి మాట్లాడారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్ లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. బలిసి కొట్టుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఐఏఎస్, ఐసీఎస్ అధికారుల మీద అధికారులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ప్రధాన హీరోల అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

గతంలో జగనన్న ఇళ్ల మీద కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. జగనన్న ఇళ్లపై వైసీపీకే చెందిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2021, జూన్ 26న సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లలో మంచం వేసుకునేంత చోటు కూడా లేదని వ్యాఖ్యానించారు. ఆ ఇంట్లో కొత్త జంటలు కాపురమే చేసుకోలేరని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. 

కాగా, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ల పేరిట పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా ఐచ్ఛికాల ఎంపికను లబ్ధిదారులకే వదిలేసింది.

తొలిదశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీలు’ పేరిట ప్రభుత్వం నిర్మిస్తుంది. సొంతగా కట్టుకునే ఇళ్లు కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సొంత స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును ఏర్పాటు చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios