ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటరిచ్చారు. లాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను చూసి మురిసిపోతున్నారని మల్లాది ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్ధితులు, పరిపాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే మల్లాది విష్ణు (malladi vishnu) కౌంటరిచ్చారు. అభివృద్ధి అంటే ఏంటో విజయవాడ వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. కోస్తా ఆంధ్ర ప్రజలు వెళ్లి తెలంగాణ, హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు కల్చర్ నేర్పి.. డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరి రెండు కళ్ల సిద్ధాంతం మూలంగా రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందని మల్లాది విష్ణు ఆరోపించారు. తమ ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ను చూసి మురిసిపోతున్నారని, అది సరైన పద్ధతి కాదని కేటీఆర్ కు మల్లాది చురకలంటించారు. ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా.. శుక్రవారం Hyderabadలో జరిగిన క్రెడాయి 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో Roads ధ్వంసమయ్యాయని చెప్పారు. Electricity , Drinking Water కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లేసుకొని వెళ్లి రావాలని కేటీఆర్ సూచించారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదన్నారు.
ఇతర రాష్ట్రాలో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో మన వాళ్లు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లంచాలు ఇస్తేనే అనుమతులు వస్తాయని కేటీఆర్ ఆరోపించారు.పరిశ్రమలకు ెపారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ అప్పు చేసి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తు తరాల మీద పెట్టేది పెట్టుబడి అవుతుందనికేటీఆర్ చెప్పారు.111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఈ జీవోను నా కోసమే ఎత్తివేశారని ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో కూడా ఈ జీవోను ఎత్తివేసేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.1.30 లక్షల ఎకరాలు నావేనా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ 111 జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టే ఉందని ఆ ప్రాంతానికి చెందినవారు తనకు చెప్పారని కేటీఆర్ వివరించారు. బెంగుళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండిపడుతున్నాయని కేటీఆర్ చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ప్రశాంతమైన రాష్ట్రమని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో ఏపీ వాసులకు అర్ధమైందని కేటీఆర్ చెప్పారు.
