విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ చీఫ్ చంద్రబాబుపై కేసు నమోదైంది. 

దళితులను అవమానించారని వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు టీడీపీ చీఫ్ చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.

also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?

దళితులను చంద్రబాబునాయుడు అవమానించేలా మాట్లాడారని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. ఆదివారం నాడు  కూడ  ఏపీకి చెందిన మంత్రులు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఐఎఎస్ అధికారి విజయ్‌కుమార్‌‌పై  చంద్రబాబు  విమర్శలు చేయడంపై వైసీపీ విమర్శలు గుప్పించింది.

ఈ విషయమై చంద్రబాబునాయుడును వైసీపీ ఘాటుగానే విమర్శించింది.  ఈ విషయమై టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ విమర్శలు గుప్పించింది. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు చంద్రబాబుపై నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.