చిత్తూరు: ఏపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా జిమ్ లో రచ్చ రచ్చ చేశారు. ఒక రూమ్ లో జిమ్ వర్కవుట్ చేయాల్సిన రోజా పబ్లిక్ గా వర్కవుట్ చేస్తూ హల్ చల్ చేశారు. రోజా జిమ్ చేస్తున్న సమయంలో కార్యకర్తలు, అభిమానులు విజిల్స్ తో జిమ్ ను హోరెత్తించారు. 

మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌‌ను ప్రారంభించారు ఎమ్మెల్యే రోజా. తర్వాత అక్కడి జిమ్ పరికరాలతో వర్కౌట్స్ చేసి అబ్బా అనిపించారు.

 
 
ఎమ్మెల్యే రోజా జిమ్ వర్కవుట్ చేస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు విజిల్స్ తో హెరెత్తించారు. అటు రోజా సైతం కార్యకర్తలను ఉత్తేజరుస్తూ మరింతగా జిమ్ చేశారు. ఈ సందర్భంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచించారు. 

ప్రజలంతా ఈ ఓపెన్ జిమ్‌ను ఉపయోగించుకొని నిత్య వ్యాయామం చేయాలని సూచించారు. రోజుకు అరగంట సేపు వ్యాయామానికి సమయం కేటాయిస్తే ఆయురారోగ్యాలతోపాటు మానసికంగా ధృఢంగా ఉంటామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.