జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న అనిల్ ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్ కుమారుడినని పవన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. తన అన్నయ్య చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న అనిల్ ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్ కుమారుడినని పవన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. తన అన్నయ్య చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ప్రతి సభలోనూ కులాన్ని ప్రస్తావించే నాయకుడే పవన్ కళ్యాణ్ అని అనిల్ ధ్వజమెత్తారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగనే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేనలు పని చేస్తున్నాయని, ప్రజలు జాగరూకతతో వచ్చే ఎన్నికల్లో ఓట్లేయాలని కోరారు.
