మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన .. మంత్రిని కట్టడి చేసే అధికారం ఎవరికీ లేదన్నారు.

మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ పగబట్టారని రాంబాబు ఆరోపించారు. నిమ్మగడ్డ చట్టానికి లోబడి పనిచేయాలని.. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మీరు నార్త్ కొరియా అధ్యక్షుడివి అనుకుంటున్నారా అంటూ అంబటి సెటైర్లు వేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జాగ్రత్తగా వుండాలని.. మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు సభా హక్కుల ఉల్లంఘనే అని ఆయన మండిపడ్డారు.

గంటా రాజీనామాపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని.. వైఎస్సార్ సీపీ కి నష్టం కలిగించాలనే పక్షపాత ధోరణి తో నిమ్మగడ్డ ఉన్నారబు ఆయన అన్నారు. మ్యానిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, చంద్రబాబు పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు.

సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండా యాప్ ని విడుదల చేసి మేము రాజ్యాంగ బద్ద వ్యవస్థ అంటే ఎవరు నమ్ముతారు? అని ఆయన అన్నారు. ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఏకగ్రీవాలు ఎక్కువ జరిగాయని ఆపటం రాజ్యాంగ విరుద్ధం అని అంబటి పేర్కొన్నారు. నిమ్మగడ్డకు భయపడి చట్టవ్యతిరేకంగా వ్యవహరించే ఉద్యోగులను కచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెడతామని అంబటి తేల్చి చెప్పారు.