Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ నేతల్నే కొట్టలేదు.. రఘురామపై చేయి చేసుకుంటామా: పోలీసులకు బాసటగా అంబటి

రఘురామకృష్ణంరాజు విమర్శలే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... టీవీ 5, ఏబీఎన్‌లతో కలిసి రఘురామకృష్ణంరాజు కుట్ర పన్నారని అంబటి ఆరోపించారు. 

ysrcp mla ambati rambabu slams mp raghu rama krishnamraju ksp
Author
Amaravathi, First Published May 16, 2021, 7:52 PM IST

రఘురామకృష్ణంరాజు విమర్శలే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... టీవీ 5, ఏబీఎన్‌లతో కలిసి రఘురామకృష్ణంరాజు కుట్ర పన్నారని అంబటి ఆరోపించారు.

రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని రఘురామకృష్ణంరాజు కుట్ర పన్నారంటూ మండిపడ్డారు. రఘురామ అరెస్ట్‌పై ఎల్లో మీడియా తెగ బాధపడిపోతోందని రాంబాబు ఎద్దేవా చేశారు. ఒక ఎంపీని పోలీసులు ఎక్కడైనా కొడతారా అని నిలదీశారు. అసహ్యంగా మాట్లాడే వ్యక్తికి చంద్రబాబు ఎలా మద్ధతిస్తారని రాంబాబు ప్రశ్నించారు.

చట్టం ముందు అందరూ సమానమేనని.... ఎంపీ అయినంత మాత్రాన చట్టం వదిలిపెట్టదని అంబటి స్పష్టం చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేశారని.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని రాంబాబు మండిపడ్డారు.

Also Read:రఘురామను ఎవరూ కొట్టలేదు: వైద్యుల నివేదికలో సంచలన విషయాలు

పార్టీని తిట్టినప్పుడు రాజీనామా చేయాలని అంబటి డిమాండ్ చేశారు. టీడీపీ నేతల్ని కూడా పోలీసులు ఎప్పుడూ కొట్టలేదని... మమ్మల్ని బూతులు తిడుతున్నాడు కాబట్టే చంద్రబాబు సంతోషపడుతున్నాడని రాంబాబు ధ్వజమెత్తారు. తనను ఏం చేయలేరంటూ రఘురామ కారుకూతలు కూశారని... హద్దులు లేకుండా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే.. రఘురామకృష్ణంరాజు ప్రవర్తించారని రాంబాబు ఆరోపించారు. అందుకు ఇప్పుడు రఘురామ అరెస్ట్‌పై బాబు గగ్గోలు పెడుతున్నారని.. ఎంపీ ప్రాణానికి హానితలపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి వుందా అని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios