అమరావతి:  ఈ నెల 7వ తేదీన వైసీపీ ఎల్పీ సమావేశం జరగనుంది. మరునాడే మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

ఈ నెల 7వ తేదీన వైసీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. గత నెల 25వ తేదీన వైసీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ పక్ష నేతగా జగన్‌ను ఎన్నుకొన్నారు.

ఈ నెల 7వ, తేదీన జరిగే వైసీఎల్పీ సమావేశంలో  మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించే విషయాన్ని   ప్రకటించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.

మంత్రివర్గంలో ఛాన్స్ కోసం పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు కొన్ని రోజులుగా జగన్ ను కలిసేందుకు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్న కారణంగా పార్టీ నేతలకు జగన్ సమయం కేటాయించలేదు.

మంత్రివర్గంలో ఎవరెవరికీ బెర్త్ కేటాయించాలనే విషయమై జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాడని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. సామాజిక సమీకరణాలతో పాటు  పార్టీలో మొదటి నుండి తన వెంట నడిచిన వారికి జగన్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.