గుంటూరు జిల్లాలో టీడీపీ సానుభూతిపరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టీడీపీకి ఓటేశారన్న కక్షతో పలువురు రైతులను గ్రామం నుంచి బహిష్కరించిన వైసీపీ నాయకులు.. తాజాగా రహదారిగా అడ్డంగా గోడ కట్టారు.

ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో టీడీపీ కార్యకర్తలు అక్కడికి దగ్గరలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లే మార్గంలో అడ్డుగా గోడ నిర్మించారు. ఈ దారుణంపై టీడీపీ కార్యకర్తలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.

దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గోడ నిర్మాణ పనులను అడ్డుకుని ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.