Asianet News TeluguAsianet News Telugu

బాబు దేన్నయినా మేనేజ్ చేయగలడు : సోమయాజుల కమిటీపై వాసిరెడ్డి పద్మ

గోదావరి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనపై ఏర్పాటయిన సోమయాజులు కమిటీ నివేదిక అధికారపార్టీకి అనుకూలంగా ఉందని ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ కమిటీ సభ్యుల చేత తనకు నచ్చినట్లు నివేదిక తయారుచేయించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తాను దేన్నయినా మేనేజ్ చేయగలని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పుష్కరాల తొక్కిసలాటకు భక్తుల మూడనమ్మకమే కారణమని జస్టిస్ సోమయాజులు ఇచ్చిన నివేదికను పద్మ తప్పుబట్టారు.

YSRCP Leader Vasireddy Padma Comments On justice somayajulu report
Author
Amaravathi, First Published Sep 19, 2018, 3:48 PM IST

గోదావరి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనపై ఏర్పాటయిన సోమయాజులు కమిటీ నివేదిక అధికారపార్టీకి అనుకూలంగా ఉందని ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ కమిటీ సభ్యుల చేత తనకు నచ్చినట్లు నివేదిక తయారుచేయించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తాను దేన్నయినా మేనేజ్ చేయగలని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పుష్కరాల తొక్కిసలాటకు భక్తుల మూడనమ్మకమే కారణమని జస్టిస్ సోమయాజులు ఇచ్చిన నివేదికను పద్మ తప్పుబట్టారు.

గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...సీఎం చంద్రబాబు ఉన్నపుడే తొక్కిసలాట జరిగిందని చెప్పారని, తన నివేదికలోను ఇదే విధంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. సీఎం స్నానం చేసేవరకు ఎవరిని అనుమతించలేదని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. కానీ జస్టిస్ సోమయాజులు నివేదికలో సీఎం వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారని అన్నారు. దీన్ని బట్టే సోమయాజులు కమిటీని చంద్రబాబు ఎంతలా మేనేజ్ చేశారో అర్థమవుతుందన్నారు.

అలాగే భక్తులపై సోమయాజులు కమిటీ వాడిన బాష కూడా అభ్యంతరకరంగా ఉందన్నారు పద్మ. అక్కడున్న భక్తులకు ఇంగితం లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. సీఎం
చంద్రబాబు నివేదిక తయారుచేస్తే సోమయాజులు దానిపై సంతకం చేశారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఈ తప్పుడు నివేదికకు వ్యతిరేకంగా వైఎస్సార్ సిపి పోరాటం చేస్తుందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios