ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. దీంతో ప్రతీ వ్యక్తిపైన సగటున రూ.75 వేల అప్పు ఉందని ఆరోపించారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయని చంద్రబాబు మహిళలకు బాకీపడ్డారన్నారు. ఆడపడుచులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కర్నూలు : ఏపీ సీఎం చం‍ద్రబాబు నాయుడుకి వైసీపీ సీనియర్ నేత శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు తాను చేసిన అభివృద్దిపై ఓట్లు అడిగే దమ్ముందా అని నిలదీశారు. అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మాత్రమే చంద్రబాబు పనికొస్తారని, సీఎంగా పనికిరారని విమర్శించారు. 

సోమవారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఫోబియా పట్టుకుందన్నారు. రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన జయహో బీసీ సభలో బీసీలకు ఆశాభంగం కలిగిందని శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. 

ఇతర పార్టీలతో కలిసి చంద్రబాబు జయహో బీసీ అంటే వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసే బీసీ గర్జన అదరహో అనేలా ఉంటుందన్నారు. చంద్రబాబు కొత్తగా ప్రకటిస్తున్న హామీలన్నీ వైసీపీ నవరత్నాలలో కాపీ కొట్టినవేనని ఆరోపించారు. టీడీపీ మోసపూరిత రుణమాఫీతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. దీంతో ప్రతీ వ్యక్తిపైన సగటున రూ.75 వేల అప్పు ఉందని ఆరోపించారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయని చంద్రబాబు మహిళలకు బాకీపడ్డారన్నారు. ఆడపడుచులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డ్వాక్రా మహిళలను సభల పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని దుయ్యబుట్టారు. జయహో బీసీ సభలో ఖాళీ కుర్చీలు తప్ప జనాలు లేకపోవడం చంద్రబాబు ప్రజావ్యతిరేకతకు నిదర్శనమన్నారు. బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ డిక్లరేషన్‌ విడుదల చేయబోతున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు.