Asianet News TeluguAsianet News Telugu

ప్రాంతాల మధ్య చిచ్చుకు కుట్రలు.. జల వివాదంపై స్పందించరా: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు. ఏ ప్రాంత ప్రయోజనాలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

ysrcp leader sajjala ramakrishna reddy slams tdp chief chandrababu naidu over water dispute ksp
Author
Amaravathi, First Published Jul 13, 2021, 6:37 PM IST

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీల గొంతు నొక్కింది చంద్రబాబేనని ఆరోపించారు. ప్రతిపక్షనేత నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన సీఎంగా పనిచేశారా అన్న అనుమానం వస్తోందని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read:ఇరకాటంలో జగన్... రాయలసీమ ఎత్తిపోతలపై స్వరాష్ట్రంలోనూ వ్యతిరేకత

బాబు హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారని సజ్జల ఆరోపించారు. జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఏ ప్రాంత ప్రయోజనాలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చంద్రబాబువి అర్ధంలేని ప్రేలాపనలన్న ఆయన.. తాను ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. ఆయనకు పుట్టిన గడ్డ, రాష్ట్రంపై ఎలాంటి ప్రేమ లేదంటూ ఎద్దేవా చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios