ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడి ఏదో చేయాల్సిన అవసరం లేదన్నారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుంత కనిపించగానే ఫోటోకు ఫోజులు ఇవ్వాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని సజ్జల సెటైర్లు వేశారు

ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడి ఏదో చేయాల్సిన అవసరం లేదన్నారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుంత కనిపించగానే ఫోటోకు ఫోజులు ఇవ్వాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని సజ్జల సెటైర్లు వేశారు. మీడియాలో చర్చలకు , ప్రచారానికే పరిమితం అవ్వాలనుకుంటున్నట్లు వుందంటూ దుయ్యబట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చంద్రబాబు హయాం కంటే చాలా మెరుగ్గా రోడ్ల నిర్మాణం చేపట్టామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడి తన స్థాయి దిగజారదలుచుకోలేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఒకరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో వున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జగన్ సమర్థత వల్లే ప్రజల విశ్వాసం పొందగలుగుతున్నామని... జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే ఆలోచనలో వున్నారేమోనంటూ సజ్జల ఆరోపించారు.