తిరుపతి: చంద్రబాబునాయుడు వంగవీటి రాధాకు ఇప్పుడు గాంధీగా కన్పించేందుకు కారణాలు చెప్పాలని వైసీపీ నేత సీ. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఒకప్పుడు వంగవీటి రాధాకు చంద్రబాబును గాడ్సేగా సంబోధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

శనివారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని హత్య చేయించింది టీడీపీయేనని వంగవీటి రాధా ఆరోపించిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.  ఆ సమయంలో రాధాకు చంద్రబాబు గాడ్సే కన్పించాడన్నారు. కానీ, ఇప్పుడు బాబులో గాంధీ ఎలా కన్పిస్తున్నారో చెప్పాలని ఆయన కోరారు.

వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో కూడ ఒంటరిగానే పోటీ చేస్తోందన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తున్నారని వివరించారు.బాబు లాంటి రాక్షసుడి పాలన నుండి ప్రజలను కాపాడే వ్యక్తి జగన్ ఒక్కడేనని  రామచంద్రయ్య విమర్శించారు.