ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీలో చేరతానంటూ వస్తున్న వార్తలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు. వైసీపీలో తాను ఇమడలేకపోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన  ఖండించారు. 

రాజకీయాల్లోకి తనను ఆహ్వానించింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయంగా గుర్తింపునిచ్చింది, ప్రోత్సహించింది దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డేనని స్పష్టం చేశారు. 

వైయస్ జగన్ నేతృత్వంలో వైసీపీలోనే తాను కొనసాగుతున్నట్లు తెలిపారు. పార్టీలో సరైన గౌరవం లభించడం లేదంటూ తాను పార్టీ శ్రేణుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. 

గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించకపోవడంతో తాను ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఆ పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాలు నిజం కావని మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు స్పష్టం చేశారు.