పైన కాషాయమైనా లోపలున్నది పసుపే: సుజనాపై వైసీపీ నేత వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. తునిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సుజనా బ్యాంకుల దొంగ అని ఆరోపించారు.
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. తునిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సుజనా బ్యాంకుల దొంగ అని ఆరోపించారు.
రాజధానిలో సుమారు వెయ్యి ఎకరాల భూమిని కొనుగోలు చేయడం వల్లే ఇప్పుడు ఆయన లబోదిబోమంటున్నారని అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తున్నారని రాజా దుయ్యబట్టారు.
Also Read:రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా... గుణపాఠం తప్పదు: పవన్
తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకుని బీజేపీ ముసుగులో మాట్లాడుతున్న సుజనా చౌదరి నోరు అదుపులోకి పెట్టుకోవాలని లేదంటే నాలుక కోస్తామని రాజా హెచ్చరించారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. మూడు రాజధానుల ప్రతిపాదనను అందరూ సమర్థిస్తున్నారని ఆమె గుర్తుచేశారు.
Also Read:జగన్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: పవన్
రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన వికేంద్రీకరణ సాధ్యపడుతుందని.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుని గీత అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు, వెనుకబడిన ప్రాంతాలు ఏపీకి వచ్చాయని ఆమె గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలను ఒకే రీతిన అభివృద్ధి చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని వంగా గీత వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదని, కమిటీ నివేదికపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని సుజనా వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్పించి రాజధానులు మార్చడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిపాలనపై దృష్టి పెట్టాల్సిందిపోయి వ్యక్తిగత దూషణలపైనే సమయం వృథా చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై సుజనా మండిపడ్డారు. రాజుగారు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా.. అసలు కమిటీ ఏం నివేదిక ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.
కమిటీ సభ్యులు ఎప్పుడు, ఎక్కడ పర్యటించారో అసలు ఎవ్వరికీ తెలియదని, ప్రభుత్వం చెప్పినట్లుగా నివేదిక ఇచ్చినట్లుగా ఉందని సుజనా అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే భూములిచ్చిన రైతుల పరిస్ధితి ఏంటని చౌదరి ప్రశ్నించారు.