ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. విశాఖలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీదా విచారణ జరుపుతామన్నారు.

చంద్రబాబు ఓటుకు రెండు వేలు, ఐదు వేలు ఇస్తారని జగన్ పదే పదే చెప్పారని బొత్స గుర్తు చేశారు. ఎన్నికల్లో టీడీపీ ధనాన్ని నమ్ముకుంటే.. వైసీపీ జనాన్ని నమ్ముకుందని సత్యనారాయణ స్పష్టం చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండటం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో అవనీతి రాజ్యమేలిందని బొత్స ఆరోపించారు.