టీవీల్లో, పేపర్లో పడాలనే టీడీపీ నేతలు జగన్ పై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ప్రజల్లో నాడు, ప్రజల్లో నేడు కార్యక్రమానికి  మంచి స్పందన వస్తోందని, ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 90 శాతం అమలు చేశారని, అన్ని వర్గాలకు మేలు చేసేలా పాలన చేస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో అమ్మ ఒడి, వాహన మిత్ర, కుల వృత్తుల వారికి ఆర్ధిక సాయం, వైయస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు‌18వేలు, అందించామని తెలిపారు. 

వైఎస్సార్‌ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రుణాలను ప్రభుత్వం హామీ చేసిందని గుర్తుచేశారు. చంద్రబాబు గతంలో అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం మంచి పనులు చేస్తోంటే టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని టీవీల్లో, పేపర్లో పడాలని చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 17నెలల కాలంలోనే 90శాతం హామీలను అమలుచేసిన  ఏకైక సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు.