Asianet News TeluguAsianet News Telugu

‘‘గడప గడప’’కుపై వైసీపీలోనే వ్యతిరేకత .. ఏం చేశామని వెళ్లమంటారు : జగన్‌ని ప్రశ్నిస్తున్న కౌన్సిలర్

సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ‘‘గడప గడపకు వైసీపీ’’ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు జనం నుంచి నిరసన సెగ తగులుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత ఒకరు జగన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

ysrcp councellor serious comments on ap cm ys jagan over gadapa gadapaku ycp
Author
Bobbili, First Published May 14, 2022, 5:01 PM IST

అసెంబ్లీ ఎన్నికలకు (ap assembly elections 2024) సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్  (ys jagan) 'గడప గడపకు వైసీపీ' (gadapa gadapaku ycp) అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని చోట్ల ఈ కార్యక్రమంలో మంత్రులు, వైసీపీ నేతలకు నిరసన సెగ తగులుతోంది. తమ వద్దకు వస్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తూ.. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనే వైసీపీకి వ్యతిరేకత ఎదురైంది. గడప గడపకు నిర్ణయంపై బొబ్బిలి వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు మండిపడ్డారు. అభివృద్ధి జరగకుండానే గడప గడపకు ఎలా వెళ్లగలనని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమని రామారావు నాయుడు ప్రశ్నించారు. ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని బహిరంగంగానే విమర్శించారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. ఇటీవలే మంత్రి గుమ్మనూరు జయరాంకు (gummanur jayaram) చేదు అనుభవం ఎదురైంది. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా (kurnool district) అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు.. అదిపోయినా తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

ఇక, రానున్న ఎన్నికలను లక్ష్యంగా  పెట్టుకుని వైసీపీ అడుగులు వేస్తుంది. మంత్రులు, వైసీసీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా సీఎం జగన్ ప్రణాళికలు రచించారు. నేటి నుంచి గడప గడపకు వైసీపీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా సచివాలయాల కేంద్రంగా గడప గడపకు వెళ్లాలని పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. నెలలో కనీసం 10 సచివాలయాలను సందర్శించాలని చెప్పారు. దీంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించడమే కాకుండా.. అవి అందుతున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానికుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios