Asianet News TeluguAsianet News Telugu

చంద్ర‌బాబు ఎలా ఆస్తులు కూడబెట్టారో భువనేశ్వరి మాట్లాడాలి... నిజం గెలవాలి యాత్ర‌పై మంత్రి జోగి రమేష్ విమర్శలు

Amaravati: తన భర్తపై అవినీతికి సంబంధించి ఆధారాలు ఇవ్వాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏపీ సీఐడీకి సవాల్ విసిరారు. తమ దర్యాప్తు తర్వాత దర్యాప్తు సంస్థ ఖాళీ చేతులతో ముందుకు వస్తుందని ఆమె నిజం గెల‌వాలి యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అన్నారు. చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ ఎక్కడ రాశారు వంటి సిల్లీ విషయాలపై విచారణ జరపకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అయితే, చంద్ర‌బాబు ఎలా ఆస్తులు కూడబెట్టారో నారా భూవ‌నేశ్వ‌రి త‌న నిజం గెల‌వాలి యాత్ర‌లో మాట్లాడాలని మంత్రి మంత్రి జోగి రమేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

YSRCP committed to welfare of disadvantaged sections, says AP Housing Minister Jogi Ramesh RMA
Author
First Published Oct 27, 2023, 4:08 PM IST

AP Housing Minister Jogi Ramesh: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా ఎలాంటి వివక్ష లేకుండా లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేస్తున్నారనీ, పేదలను రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేశారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ‘సామాజిక సాధికార యాత్ర’ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో  జోగి రమేష్‌ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎ.సురేష్, ఎమ్మెల్యేలు ఎ.శివకుమార్, హఫీజ్ ఖాన్, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కేబినెట్‌ బెర్త్‌లు, రాజకీయ పదవుల కేటాయింపులో వైఎస్ఆర్సీపీ ఈ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి అన్నారు. కాగా, తన భర్తపై అవినీతికి సంబంధించి ఆధారాలు ఇవ్వాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏపీ సీఐడీకి సవాల్ విసిరారు. తమ దర్యాప్తు తర్వాత దర్యాప్తు సంస్థ ఖాళీ చేతులతో ముందుకు వస్తుందని ఆమె నిజం గెల‌వాలి యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అన్నారు. చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ ఎక్కడ రాశారు వంటి సిల్లీ విషయాలపై విచారణ జరపకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అయితే, చంద్ర‌బాబు ఎలా ఆస్తులు కూడబెట్టారో నారా భూవ‌నేశ్వ‌రి త‌న నిజం గెల‌వాలి యాత్ర‌లో మాట్లాడాలని మంత్రి మంత్రి జోగి రమేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'నిజం గెలవాల'ని సూచిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి త‌న కార్యక్రమంలో చంద్రబాబు ఎలా ఆస్తులు కూడబెట్టారో ఆమె మాట్లాడాలని అన్నారు. తన తండ్రి ఎన్టీ రామారావు నుంచి నాయుడు టీడీపీని ఎలా కైవసం చేసుకున్నారో వెల్లడించాలంటూ చుర‌క‌లంటించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని  వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌నీ, మ‌రోసారి రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తంచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios