తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో జరిగిన కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలను రద్దు చేసి.. త్రిసభ్య కమిటీని నియమించింది వైసీపీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఆదేశాలను చూపించాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పది మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు . అయితే ఆందోళనల మధ్యే ప్రమాణ స్వీకారం చేసింది త్రిసభ్య కమిటీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
