పల్నాడు జిల్లాలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు  దాడికి దిగారు. దుర్గిలో బ్యాంక్‌  పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా జంగ మహేశ్వరపురంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేత జల్లయ్య మృతి చెందాడు.

పల్నాడు జిల్లాలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. జంగమహేశ్వరపురంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేత జల్లయ్య మృతి చెందగా.. మరొకరి పరిస్ధితి విషమంగా వుంది. దుర్గిలో బ్యాంక్‌ పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.