పెన్షన్‌దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.  ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ (వైఎస్సార్ పెన్షన్ కానుక) మొత్తాన్ని రూ.3000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

పెన్షన్‌దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ (వైఎస్సార్ పెన్షన్ కానుక) మొత్తాన్ని రూ.3000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మొత్తాన్ని జనవరి 1 నుంచి అమలు చేస్తామని పేర్కొంది. గత ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్‌ను రూ.3000 ఇస్తామని జగన్ ప్రకటించారు. దీనిలో భాగంగా దశలవారీగా పెన్షన్‌ను పెంచుతూ వచ్చారు ముఖ్యమంత్రి . అలా ప్రస్తుతం రూ.2,750గా వున్న పెన్షన్‌ను రూ.3000కు పెంచారు జగన్. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వున్న పెన్షన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వైఎస్సార్ పెన్షన్ కానుక కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు , ట్రాన్స్‌జెండర్స్, వితంతువులకు పెన్షన్ అందిస్తూ వస్తున్నారు జగన్. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా పెన్షన్ పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని జగన్ ఇచ్చిన మాట నెరవేర్చినట్లయ్యింది.