ఎంబీబీఎస్ ప్రశ్నాపత్రం సెల్‌ఫోన్ లో ఫోటో: కర్నూల్‌లో ఇన్విజిలేటర్ తొలగింపు
ఎంబీబీఎస్ అనాటమీ పేపర్-2 ప్రశ్నాపత్రాన్ని సెల్ ఫోన్ లో ఫోటో తీస్తూ ఇన్విజిలేటర్ పట్టుబడ్డారు.
కర్నూల్: ఎంబీబీఎస్ అనాటమీ పేపర్- 2 ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్ డాక్టర్ చక్రపాణి సెల్ ఫోన్ లో ఫోటో తీస్తూ దొరికిపోయాడు. డాక్టర్ చక్రపాణిని ఇన్విజిలేటర్ విధుల నుండి తప్పించారు.
ఈ నెల 25వ తేదీ నుండి ఎంబీబీఎస్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న అనాటమి పేపర్ 2 పరీక్షలు జరిగాయి. కరన్ూల్ మెడికల్ కాలేజీలో జరిగిన అనాటమీ పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ను ఇవ్విజిలేటర్ డాక్టర్ చక్రపాణి తన ఫోన్ లో ఫోటో తీశాడు. ఈ విషయాన్ని గుర్తించిన చీఫ్ అభ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస్ ఇన్విజిలేటర్ డాక్టర్ చక్రపాణిని నిలదీశారు.
సెల్ ఫోన్ ను పరీక్షా కేంద్రంలోకి ఎలా తీసుకువచ్చారని ప్రశ్నించారు.ఈ విషయమై ఏదో సమాధానం చెప్పి తప్పించుకొనేందుకు డాక్టర్ చక్రపాణి ప్రయత్నంచారు. ఇన్విజిలేటర్ డాక్టర్ చక్రపాణి ఫోన్ ను చీఫ్ అభ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ ఫోన్ లో అనాటమీ పేపర్-2, అనాటమీ పేపర్-1 క్వశ్చన్ పేపర్లను గుర్తించారు. ఈ విషయాన్ని కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకు వచ్చారు. కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై పూర్తిస్థాయి లో విచారణ చేయనున్నారు.