వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ విచారణకు భాస్కర్ రెడ్డి, ఐఓ లేకపోవడంతో ఇంటికి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య   కేసు విచారణను  సీబీఐ వేగం పెంచింది.  ఇవాళ  సీబీఐ విచారణకు   వైఎస్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. 
 

YS Vivekananda Reddy Murder Case: YS Bhaskar Reddy Appears Before  CBI Probe  in Kadapa

కడప:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి  ఆదివారం నాడు  సీబీఐ విచారణకు  హాజరయ్యారు. ఇవాళ  ఉదయం  పులివెందుల నుండి కడపకు  వైఎస్ భాస్కర్ రెడ్డి  వచ్చారు. కడప సెంట్రల్ జైలు వద్ద గెస్ట్ హౌస్ లో  వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారణకు  రావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు  వైఎస్ భాస్కర్ రెడ్డి  కడప  సెంట్రల్ జైలు వద్ద  ఉన్న గెస్ట్ హౌస్ వద్దకు  వెళ్లారు. 

వైఎస్ భాస్కర్ రెడ్డి  కడప సెంట్రల్  జైల్ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లిన సమయంలో  ఈ కేసును విచారించే విచారణ అధికారి  లేరు. విచారణ  అధికారి అందుబాటులో లేనందున  మరోసారి  విచారణకు  రావాల్సిందిగా  నోటీసులు  ఇస్తామని  సీబీఐ అధికారులు  తనకు చెప్పారని వైఎస్ భాస్కర్ రెడ్డి  చెప్పారు.

కడప సెంట్రల్ జైలు వద్దకు  వైఎస్ భాస్కర్ రెడ్డి  వచ్చిన సమయంలో  ఆయన అనుచరగణం  భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.  వైఎస్ భాస్కర్ రెడ్డి కారును గెస్ట్  హౌస్ వద్దకు తీసుకెళ్లడానికి  పోలీసులు కొంత  కష్టపడ్డారు. కడప సెంట్రల్ జైలు వద్దకు  చేరుకున్న  భాస్కర్ రెడ్డి అనుచరగణాన్ని  పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుండి  పంపారు.ఈ సమయంలో కొంత  ఉద్రిక్తత  చోటు చేసుకుంది. 

గతంలో  కూడా  సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించారు.    ఇవాళ మరోసారి  విచారణకు రావాలని కోరారు. దీంో  వైఎస్ భాస్కర్ రెడ్డి  విచారణకు హాజరయ్యారు.   రెండు రోజుల క్రితం  వైఎస్ భాస్కర్ రెడ్డి తనయుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని   సీబీఐ అధికారులు విచారించారు. తండ్రీ కొడుకులను  రెండు రోజుల వ్యవధిలోనే  సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు.  కానీ ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించలేదు ఈ కేసును విచారించే విచారణ అధికారి  కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కు రాలేదు.  విచారణ అధికారి  ఏ  కారణాలతో  రాలేదనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు. 

also read:వైఎస్ వివేకా హత్య కేసు: నేడు సీబీఐ విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు విచారణ  పారదర్శకంగా  జరగడం లేదని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తనను లక్ష్యంగా  చేసుకొని  సీబీఐ విచారణ సాగుతుందని ఆయన ఆరోపణలు  చేశారు. సీబీఐ అధికారులు లీకులు ఇస్తున్నారని  కూడా  ఆయన  విమర్శలు గుప్పించారు.  రెండు రోజుల క్రితం విచారణకు హాజరైన తర్వాత  మీడియాతో మాట్లాడిన సమయంలో  కీలక విషయాలను ఆయన  ప్రస్తావించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios