వైఎస్ వివేకా హత్య కేసు: మూడో రోజు ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి  మూడో రోజు  ముగిసింది

YS Vivekananda Reddy Murder Case   :YS Bhaskar Reddy and Uday Kumar Reddy  Third  day CBI Probe  Completed lns


హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల  మూడో రోజు విచారణ  శుక్రవారం నాడు ముగిసింది. సీబీఐ  ఆఫీస్ నుండి  వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను  సీబీఐ అధికారులు  చంచల్ గూడ జైలుకు తరలించారు.  వీరిద్దరిని  ఆరు రోజుల పాటు  సీబీఐ  కస్టడీకి  అప్పగించింది  కోర్టు.  ప్రతి రోజూ చంచల్ గూడ జైలు నుండి వీరిద్దరిని   సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చి  విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

ఈ నెల  14న  ఉదయ్ కుమార్ రెడ్డిని  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్  చేసిన రెండు రోజులకే  ఈ నెల  16న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్  రెడ్డిని సీబీఐ అరెస్ట్  చేసింది. మూడు రోజులుగా వీరిని  సీబీఐ విచారిస్తుంది.వీరిద్దరితో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.  ఈ ముగ్గురిని వేర్వేరుగా కలిపి  విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి  హత్య తర్వాత  చోటు చేసుకున్న పరిణామాలు, హత్యకు దారితీసిన  పరిస్థితులపై  సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఇవాళ కూడా  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు  హాజరయ్యారు. రేపటి విచారణ విషయమై  సీబీఐ అధికారులు  ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ రాత్రికి  ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టుగా  సీబీఐ అధికారులు   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సమాచారం  ఇచ్చారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి  వైఎస్ భాస్కర్ రెడ్డిలను  సీబీఐ అనుమానిస్తుంది.  ఈ మేరకు ఆధారాలు కూడా సేకరించామని  సీబీఐ  చెబుతుంది.  వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్  విచారణ సందర్భంగా   సీబీఐ తరపు న్యాయవాది ఈ విషయాలను తెలంగాణ హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

also read:వివేకా కేసు.. ముగిసిన అవినాష్ రెడ్డి మూడో రోజు సీబీఐ విచారణ, రేపు ఏం జరగబోతోందో..?

2019  మార్చి 14న  పులివెందుల లలో  మాజీ మంత్రి  వైఎస్ వివేకానంద రెడ్డి ని దుండగులు  హత్య  చేశారు.   ఈ కేసు దర్యాప్తును   ఈ నెలాఖరు వరకు  పూర్తి చేయాలని   సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు  దర్యాప్తును  పూర్తి చేయనుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios